- Advertisement -
దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రాజమౌళి… ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉంటున్నట్లు వెల్లడించారు.
జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకున్నామని ఈ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిందని… ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలు లేకుండా బాగున్నాం. కానీ జాగ్రత్తలు పాటిస్తున్నాం అన్నారు.
యాంటీబాడీస్ డెవలప్ అవడం కోసం ఎదురు చూస్తున్నాం. అవి వృద్ధి కాగానే ప్లాస్మా డొనేట్ చేస్తాం అని తెలిపిన రాజమౌళి ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్నామని తెలిపారు. టాలీవుడ్లో కరోనా బారిన పడిన తొలి దర్శకుడు రాజమౌళినే కావడం గమనార్హం.
- Advertisement -