గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు థాంక్యూ: కాజల్

267
kajal
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు ,హీరోయిన్లు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనగా తాజాగా నిర్మాత, నటులు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీను వైట్ల హైదరాబాద్‌లో మొక్కలు నాటారు.

అనంతరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తనవంతు బాధ్యతగా.. టాలీవుడ్ అందాల కాజల్ అగర్వాల్, నటుడు- సమాజ సేవకుడు సోనూసుద్, టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపి మోహన్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.

ఈ సందర్భంగా తనను గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు థాంక్యూ చెప్పింది అందాలభామ కాజల్. త్వరలో ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటుతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -