సమ్మోహనం సినిమాతో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తన తర్వాతి సినిమా మల్టీస్టారర్ ను తెరెకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఆయన స్క్రీప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. ఈ మల్టీస్టారర్ లో ఒక హీరో నానిని ఫిక్స్ చేయగా మరో హీరో కోసం వెతుకుతున్నారు దర్శకుడు.
ఇంద్రగంటి నాని కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు అష్టాచమ్మా, జెంటిల్ మేన్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దింతో మరోసారి ఈకాంబినేషన్ లో సినిమాను చేయనున్నారు. ఇక రెండవ హీరో కోసం వెతికే పనిలో ఉన్నాడు ఇంద్రగంటి. ఇటివలే నిఖిల్ ను సంప్రదించాడట దర్శకుడు. దింతో వెంటనే ఆయనకు కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.
నిఖిల్ కు కూడా కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దింతో త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ చేస్తుండగా.. నిఖిల్ ముద్రలో నటిస్తున్నాడు. ఈసినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.