సుప్రీమ్ హీరో సాయిధరమ్ హీరోగా మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంతా సిద్దమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం ‘విన్నర్’. ఈ మూవీ బక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని చూపించకపోవడంతో మారో ప్రయత్నానికి రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జులై మొదటి వారంలో మొదలవనున్నట్లు సమాచారం.
ఈ సారి బలమైన స్టోరీతో మలినేని తెరకెక్కింబోతున్న ఈ సినిమాకు బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం సాయిధరమ్ ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాను క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తుండగా జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.