రాజమౌళి మల్టీ స్టారర్‌.. పోలీస్ పాత్రలో చరణ్..

266
- Advertisement -

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారనే సంగతి తెలిసిందే. రాజమౌళి-రాంచరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ ఇపుడు టాలీవుడ్ లో భారీ చర్చకు దారితీస్తుంది. బడ్జెట్ పరంగా బాహుబలి కంటే తక్కువే ఉండొచ్చు గాని తారాగణం మాత్రం భారీగా ఉంటుందనే విషయం స్పష్టమైంది. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగనుందనే ప్రచారం కొన్ని రోజులక్రితం వరకూ జోరుగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్రపై చాలా రూమర్లు వచ్చాయి. వాటిని విని చరణ్ కొన్ని సార్లు విసుక్కుని – ఇంకొన్ని సార్లు నవ్వుకుని కాలం గడిపారు. ఇపుడు ఆయన పాత్రపై క్లారిటీ వచ్చేసింది.

Ram Charan's role in SS Rajamouli's film #RRR revealed

ఆయన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ‘తూఫాన్ ‘ పరాజయంపాలు కాగా, ‘ధ్రువ’ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. మూడవసారి ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా అభిమానులను అలరించనున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్ర ఏమై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్టీఆర్ .. చరణ్ జోడీలుగా ఎవరు కనిపించనున్నారనేది కూడా అభిమానుల్లో ఆత్రుతను పెంచుతోంది.

- Advertisement -