నిద్రపోయే ముందు ఇలా చేస్తున్నారా.. జాగ్రత్త!

259
- Advertisement -

నేటి ఆధునిక జీవన విధానంలో అత్యధిక మందిని వేధించే సమస్య.. నిద్రలేమి. రోజంతా పని ఒత్తిడి కారణంగా అలసిపోయిన వారికి రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టక సతమతం అవుతూ ఉంటారు.. కొందరికి శరీరం ఎంత అలసటగా ఉన్న నిద్ర పట్టదు. అయితే మనం ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా వివిద పనుల కారణంగా మన శరీరంలోని అన్నీ అవయవాలు ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తాయి. అందువల్ల శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. అందుకే రోజుకు 6-8 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇలా నిద్రకు సరైన సమయం కేటాయించడం వల్ల మళ్ళీ ఉదయాన్నే ఫుల్ యాక్టివ్ గా ఉండగలం..

అయితే కొందరికి రాత్రుళ్లు కూడా సరిగా నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ సరైన సమయం నిద్రకు కేటాయించకపోతే.. నిద్రలేమి సమస్య పెరిగే అవకాశం ఉంది. అయితే రాత్రి పూట నిద్ర పట్టకపోవడానికి చాలా కారణలే ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారికి నిద్రలేమి సమస్య అధికంగా వేదిస్తుంది. అందువల్ల ప్రశాంతమైన గాఢ నిద్ర కోసం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక రాత్రుళ్లు టీ, కాఫీ, చాక్లెట్ వంటివి తీసుకున్న నిద్ర దురమౌతుంది. అందువల్ల రాత్రి భోజనం చేసిన తరువాత టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే రాత్రిపూట నీరు ఎక్కువగా తాగిన.. నిద్రపై ప్రభావం పడుతుందట. అందువల్ల రాత్రి వీలైనంత తక్కువ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలా మందికి రాత్రి భోజనం చేసిన తరువాత ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. ఇలా ఐస్ క్రీమ్ తినడం వల్ల శరీరంలోని నరాలు ఉత్తేజానికి లోనై నిద్ర సరిగా రాదు. అందువల్ల నిద్ర కోసం రాత్రిపూట ఐస్ క్రీమ్ కు దూరంగా ఉండడం మంచిది. ఇక అన్నిటి కంటే ముఖ్యం చాలా మందికి రాత్రి పూట మొబైల్ చూస్తే అలవాటు అడికంగా ఉంటుంది. టైమ్ ఎంత గడుస్తున్న మొబైల్ చూస్తూ నిద్ర సమయాన్ని వృధా చేస్తుంటారు చాలామంది. ఇలా చేయడం చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ లో ఉండే లైటింగ్ నేరుగా మన కళ్లపై పడడం వల్ల నిద్ర దురమౌతుంది. అలాగే కళ్ల మంటలు, తలనొప్పి వంటి సమస్యలు కూడా చుట్టూ మూడతాయి. అందువల్ల రాత్రి పడుకునే ముందు మొబైల్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పట్టడంతో పాటు రోజు నిద్ర లేవగానే ఎంతో యాక్టివ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి…

చలికాలంలో ఈ పండు తింటే.. ఇన్ని ఉపయోగాలా !

సొరకాయ రసంతో.. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ !

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ‘ అర్ద చంద్రాసనం ‘ !

- Advertisement -