తెలుగింటి సీతమ్మ గా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న అంజలి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. కొన్నాళ్ళుగా తెలుగులో సరైన ఆఫర్స్ లేక సతమతమవుతున్న అంజలికి కోలీవుడ్ బడా ఆఫర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మధ్య చిత్రాంగద అనే చిత్రాన్ని చేసిన ఈ అమ్మడు ఆ మూవీని ఇటు తెలుగు,అటు తమిళంలో విడుదల చేసింది. ఈ చిత్రం అభిమానులను అంతగా అలరించలేకపోయింది. కట్ చేస్తే కొన్నాళ్లుగా అంజలి ప్రేమ పెళ్లి విషయం కోలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది. దానిని నిజం చేస్తూ ఆ మధ్య జై తమిళ స్టార్ సూర్య పిలుపుతో ‘దోశ ఛాలెంజ్’ను స్వీకరించి, దోశ వేసి అంజలితో తినిపించిన సంగతి తెలిసిందే.
అంజలి కొద్ది రోజులుగా తమిళ నటుడు జై తో డేటింగ్ చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ నెల 6న జై బర్త్ డే సందర్భంగా, అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతని కోరికలు నెరవేరాలనీ .. తమ బంధం ఎప్పటికీ ఇలానే వుండాలని ట్వీట్ చేసింది అంజలి. అంతేకాదు ‘బెలూన్’ సినిమా షూటింగ్ లో ఉన్న జై దగ్గరకు అంజలి కేక్ తో వెళ్లింది. యూనిట్ మధ్య జైతో కేక్ కట్ చేయించి, తినిపించిందట. ఆ రోజంతా వారిద్దరూ కలిసే ఉన్నారని, అచ్చం భార్యాభర్తల్లాగే ఉన్నారని ‘బెలూన్’ సినిమా యూనిట్ చెబుతోంది. వచ్చే ఏడాది వరకు వారి వారి ప్రాజెక్ట్స్ ని అన్నింటిని పూర్తి చేసి పెళ్లి పీటలెక్కాలనేది ఇద్దరి ప్లాన్ అట. మరి ఈ ప్రేమ పెళ్లి విషయంపై ఇద్దరిలో ఎవరైన స్పందిస్తారేమో చూడాలి. వీరిద్దరూ జర్నీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.