ధృవను చూసిన పవర్‌స్టార్‌…….

207
Dhruva,Pawan Kalyan,Ram Charan,USA,US promotional,Boxoffice,tollywood,Arvind Swamy,US box office,Dhruva $1 Million,word,India,Powerstar Dhruva,success,Dhruva premiere
- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ న‌టించిన ‘ధృవ’హిట్ టాక్ తో దూసుకుపొతుంది. ఇప్ప‌టికే యు.స్ లో మిలియ‌న్ మార్క్ దాటిన ఈ సినిమా ఇండియాలో కూడా బాక్స్‌ ఆఫీసు వద్ద క‌లెక్ష‌న్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పెష‌ల్ గా ‘ధృవ’మూవీ షో వేయించుకోని చూసారట‌. సినిమా చూసున్నంత సేపు బాగా ఎంజాయ్ చేశార‌ని , ద‌ర్శ‌కుడు హాండిల్ చేసిన విధానం చాలా బాగుంద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర పవన్‌ కొనియాడారంట‌. ఇక రామ్ చరణ్ పెర్ఫామన్స్, సినిమా కోసం త‌న‌ని తాను మార్చుకున్న తీరు బాగా న‌చ్చింద‌ట‌. సినిమా చూసి వెంట‌నే చెర్రి కి ఫోన్‌ చేసి పవర్‌స్టార్‌ అభినందించాడ‌ని సమాచారం‌. మొత్తానికి చెర్రి క‌ష్టానికి అటు ఆడియెన్స్ నుంచి ఇటు ఫ్యామిలి నుంచి మంచి స‌పొర్ట్ దొరికింద‌నే చెప్పాలి.

Dhruva’s Movie inspired by Pawan Kalyan

మొత్తం మీద రామ్ చరణ్ మిలియన్ డాలర్ కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. ‘ధృవ’అనుకున్నట్లుగానే అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టింది. కంటెంట్ ఉన్న సినిమా కావడం.. ప్రమోషన్ కూడా బాగా చేయడంతో ‘ధృవ’ఫస్ట్ వీకెండ్లోనే మిలియన్ క్లబ్బుకు చేరువగా
వచ్చింది.

మంగళవారం నాడు ఈ మ్యాజిక్ మార్కును దాటేసి.. స్టడీ కలెక్షన్లతో సాగుతోంది. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో ‘ధృవ’ఇంకొన్ని లక్షల డాలర్లు కొల్లగొట్టే అవకాశముంది. 1.5 మిలియన్ మార్కు సాధ్యం కాకపోవచ్చు కానీ.. ఫుల్ రన్లో 1.3 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేస్తుందని అంచనా.

Dhruva’s Movie inspired by Pawan Kalyan

ఈ ఏడాది అమెరికాలో టాలీవుడ్ కు ‘ధృవ’తొమ్మిదో మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఒక ఏడాదిలో అత్యధిక మిలియన్ డాలర్ మూవీలు రావడం అంటే ఇదే. త్రివిక్రమ్ మూవీ ‘అఆ’ఈ ఏడాది అమెరికాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. ఆ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. ‘నాన్నకు ప్రేమతో’ 2.09 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. 2 మిలియన్ క్లబ్బులోకి చేరినవి ఆ రెండే. తర్వాతి స్థానాల్లో వరుసగా జనతా గ్యారేజ్ (1.8 మిలియన్).. ఊపిరి (1.56 మిలియన్).. 24 (1.47 మిలియన్).. పెళ్లిచూపులు (1.19 మిలియన్).. బ్రహ్మోత్సవం (1.15 మిలియన్).. సర్దార్ గబ్బర్ సింగ్ (1.07 మిలియన్) ఉన్నాయి. ‘ధృవ’ది ప్రస్తుతం తొమ్మిదో స్థానం. ఈ చిత్రం ఆరో స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి.

- Advertisement -