రకుల్‌తో మరోసారి అంటున్న మెగాహీరో..

212
- Advertisement -

హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా కుదిరితే ఇక వారి నెక్స్ట్ సినిమాల అంచనాలకు హద్దే ఉండదు. టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. అప్పట్లో ఎక్కువగా హిట్ ఫెయిర్‌లు కంటిన్యూ అవుతూ ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు ఒకసారి నటించిన హీరోయిన్ తో మారోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్ట పడటం లేదు. కానీ చెర్రి మాత్రం బలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Rakul Hattrick with Charan, Boyapati!

అయితే రంగస్థలం సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో చేయడానికి ఫిక్స్ అయ్యాడు చరణ్‌. రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలు కూడా సింపుల్ గా స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకు ముందు రకుల్ చరణ్‌తో బ్రూస్ లీ- ధృవ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అందులో బ్రూస్ లీ అశించిన ఫలితం ఇవ్వలేదు. దృవ మాత్రం బంపర్ హిట్ అయ్యింది. అయితే ఫలితం ఎలా ఉన్నా రెండు సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా సెట్ అయ్యింది. దీంతో మరోసారి కూడా కలిసి హిట్ కొట్టాలని చూస్తోంది ఈ కాంబో. ఇక బోయపాటి కూడా రకుల్ తో సరైనోడు జయ జానకి నాయక సినిమాలు చేశాడు. ఇక ఈసారి కూడా అమ్మడు ఒకే అయితే ఈ దర్శకుడితో హీరోతో కూడా ముచ్చటగా మూడవసారి చేసినట్టే. మరి వీరి కాంబో సెటౌంతుందో లేదో చూడాలి.

- Advertisement -