ఆ పాటకోసం అలా చేశా…..

117
rakul preet singh diet

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం చేతి నిండా వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్న ఈ అందాల బ్యూటీ. రామ్‌చరణ్‌కు జోడీగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రకుల్‌ నటించిన ‘ధృవ’బ్యాక్స్‌ఆఫీసు వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇటీవలే మీడియాతో రకుల్‌ చిట్‌చాట్‌ చేసింది. ఈ చిట్‌చాట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది రకుల్‌…

rakul preet singh

ధృవలోని ఓ పాటకోసం రకుల్‌ ప్రీతిసింగ్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగలేదట. ఎందుకంటే తన పొట్ట ఉబ్బెత్తుగా కనపడుతుందని దాని కోసం ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగేదాన్ని కాదని చెప్పింది ఈ అందాల భామ. ధృవ లోని పరేషానురా అనే పాట కోసం వాటర్‌ మిలన్‌ డైట్‌ తీసుకోలేదని చెప్పింది ఈ అమ్మడు. దాహాం వేస్తే నోరు తడుపుకునే దాన్ని, నీరసంగా ఉంటే ఒకటో,రెండో పుచ్చకాయముక్కలు తినే దాన్ని,…అలా నాలుగు రోజులపాటు ఉన్న అని తన బాధను చెప్పుకుంది రకుల్‌. కేవలం ఈ ఒక్క పాటకే అలా కష్టపడ్డానని తెలిపింది రకుల్‌.

rakul preet singh

బ్రూస్‌లీ ఆశించని ఫలితం దక్కకలేదని, ఆ తర్వాత ‘ధృవ’కోసం నన్ను అడిగారు. ‘కిక్‌ 2’సరిగ్గా ఆడకున్నా నాపై నమ్మకంతో సురేందర్‌రెడ్డి గారు ఈ అవకాశమిచ్చారు. నేను ఒక్క రాత్రిలో స్టార్‌ని కాలేదు. అందుకు చాలా టైమ్‌ పట్టింది. కానీ, షూటింగ్‌ పూర్తవగానే నేను మామూలు రకుల్‌లానే ఉంటా. ఇప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగమ్మాయిని అయిపోయా. మా తమ్ముడు కూడా నటుడిగా సినీ రంగంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు.

rakul preet singh

రాజమౌళిగారితో పని చేయాలన్నది నా డ్రీమ్‌. పూర్తి స్థాయి రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది. ప్రస్తుతం మహేశ్, కార్తీ, నాగ చైతన్య, సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలకు కమిట్‌ అయ్యా. ‘విన్నర్‌’లో అథ్లెట్‌ పాత్రలో కనిపిస్తున్నా. రానున్న కొత్త ఏడాదిని గోవాలో ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోనున్నా’అని రకుల్‌ ప్రీత్‌ చెప్పారు.