సార్ మూవీ ఎలా ఉందంటే.. హిట్టా ? ఫట్టా?

79
- Advertisement -

తమిళ్ ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. తమిళ్ లో ఈ హీరోకు ఉండే క్రేజ్ అంత ఇంతా కాదు. దనుష్ కేవలం తమిళ్ వరకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ వంటి ఇతర ఇండస్ట్రీలలో కూడా గుర్తింపు సంపాధించుకున్నాడు. ప్రస్తుతం దనుష్ నటించిన తాజా చిత్రం ” సార్ “.. తెలుగు యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా నిర్మాత నాగవంశీతో పాటు త్రివిక్రమ్ సతీమణి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ తన కెరియర్ లో మొదటిసారి నేరుగా ” సార్ ” మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ మూవీతో ధనుష్ టాలీవుడ్ లో మొదటి హిట్ కొడతాడా ? ఇంతకీ మూవీ ఎలా ఉంది ? ఆనేది షార్ట్ అండ్ స్ట్రైట్ గా తెలుసుకుందాం !

కథ విషయానికొస్తే.. మూవీ మొత్తం 1998 నుంచి 2000 మద్య జరుగుతున్న కథగా రూపొందింది. శ్రీనివాస్ త్రిపాఠి ( సముద్రఖని ) విద్యాసంస్థల చైర్మెన్ విద్యను ఒక వ్యాపారంగా భావిస్తూ.. విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ స్టూడెంట్స్ ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో విధ్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆదిపత్యం చలాయిస్తు ఉంటాడు. కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో బాల గంగాధర్ తిలక్ ( ధనుష్ ) జూనియర్ లెక్సరర్ గా పని చేస్తూ ఉంటాడు. విద్యార్థులను పాస్ చేయించి ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో విధ్య.. ప్రైవేట్ విద్యా సంస్థలలో వ్యాపారంగా మారుతుందని గ్రహించిన హీరో ధనుష్.. త్రిపాఠీ ( సముద్రఖని ) కుట్ర ఎలా భయటపెడతాడు. తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు ఆనేది మిగిలిన కథ.

విశ్లేషణ.. నేటి రోజుల్లో విద్యా వ్యాపారంగా ఎలా మారుతోంది ఆనేది మూవీలో చాలా చక్కగా చూపించారు దర్శకుడు వెంకీ అట్లూరి, సింపుల్ కథతో చక్కగా తెరకెక్కించినప్పటికి స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది. కథ పాతది కావడంతో ఆల్రెడీ.. తరువాత ఏం జరుగుతుందనే అంశాలను సినీ ప్రేక్షకులు ముందుగానే పసిగట్టవచ్చు. పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం కూడా మూవీకి మైనస్ అనే చెప్పవచ్చు. అయితే ధనుష్ నటన ఈ సినిమాకు మేజర్ హైలెట్ గా నిలుస్తుంది. మూవీలో అక్కినేని సుమంత్ క్యారెక్టర్ కూడా పరవలేదనిపిస్తుంది. చక్కటి మెసేజ్ తో కూడిన కమర్షియల్ అంశాలతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించాడు. మరి ఈ సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమేర అదరిస్తారో చూడాలి.

రేటింగ్ : 2.75 / 5

ఇవి కూడా చదవండి..

- Advertisement -