కరోనా నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది. ఎంతసేపూ కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార లాంటి డబ్బింగ్ సినిమాలే తప్ప స్ట్రెయిట్ హిందీ మూవీస్ సంచలనాలు నమోదు చేయడంలో తడబడుతున్నాయి. ఎట్టకేలకు పఠాన్ రూపంలో బాక్సాఫీస్ దశ తిరిగింది. నెల తిరక్కుండానే ఏకంగా 900 కోట్ల గ్రాస్ దాటడం అంటే చిన్న విషయం కాదు.
మెల్లగా కలెక్షన్లు తగ్గిపోతున్న టైంలో యష్ రాజ్ ఫిలిమ్స్ కొత్త ఎత్తుగడ వేసింది. రేపు శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని మల్టీ ప్లెక్సుల్లో టికెట్ ధర కేవలం 112 రూపాయలు నిర్ణయించడంతో మరోసారి భారీ నెంబర్లు నమోదు కాబోతున్నాయి. మాములుగా వీకెండ్స్ లో ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో కనీస రేట్ 400 పైనే ఉంటుంది. ఇప్పుడు సగానికంటే ఎక్కువ ఆఫర్ చేయడంతో ఎగబడటం ఖాయం.
రేపు రిలీజ్ కాబోతున్న షెహజాదా ఇంకో అడుగు ముందుకు వేసింది. పఠాన్ తమను టార్గెట్ చేసిందని గుర్తించి ఏకంగా 1+1 టికెట్లను ప్రకటించేసింది. అంటే ఒకరు పెట్టే ఖర్చుతో హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో రీమేక్. కార్తీక్ ఆర్యన్ కృతి సనన్ హీరో హీరోయిన్లు. అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామి. ఇలా పోటాపోటీగా నువ్వా నేనా ఆఫర్లు ప్రకటించడంతో నార్త్ సైడ్ థియేటర్లలో మంచి హౌస్ ఫుల్స్ ఖాయం. తెలుగు సినిమాలకూ ఇలాంటివి వస్తే ఎంత బాగుంటుందో.
ఇవి కూడా చదవండి..

