క్షుద్ర పూజ‌లపై స్పందించిన డీహెచ్‌ శ్రీనివాస్‌

77
dh
- Advertisement -

క్షుద్ర పూజల ఆరోపణలపై స్పందించారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. కొత్తగూడెంలో జ‌రిగిన పూజ‌ల్లో శ్రీనివాస్ పాల్గొన్న వీడియోలు మీడియాలో ప్ర‌సారం కావ‌డంతో స్వయంగా ఆయనే వివరణ ఇచ్చారు. క్షుద్రపూజల్లో పాల్గొనట్టు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. సుజాత నగర్ ఎంపీపీ చేపట్టిన పూజలో మాత్రమే తాను పాల్గొన్నానని…అక్కడ జరిగింది హోమం మాత్రమేనని స్పష్టం చేశారు.

మా నాన్న పేరిట పెట్టిన చారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నాం అని హాలిడేలో భాగంగా కొత్త‌గూడెం వెళ్లాను…. బంజారా గిరిజ‌న దేవ‌త పూజ‌కు మాత్ర‌మే హాజ‌ర‌య్యా అని తెలిపారు. రాజ‌కీయాల‌తో తనకు సంబంధం లేదన్నారు.

సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసిన సంగతి తెలిసిందే. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ హోమంలో శ్రీనివాస్ పాల్గొన్నడం, పూజలు చేయడం దుమారం రేపింది.

- Advertisement -