ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి..

164

ప్రశాంత వాతావరణంలో వినాయక పండుగ జరిగేలా ఏట్లు చేస్తున్నాం అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో సమావేశం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, మల్లారెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి , సైబరాబాద్ , హైదరాబాద్ , రాచకొండ సిపి లు అంజనీ కుమార్ , మహేష్ భగవత్ , స్టీఫెన్ రవీంద్ర , శాసన మండలి విప్ ప్రభాకర్ రావు , ఎం.ఏ.ఎల్ లు మాగంటి గోపీనాథ్ , కాలేరు వెంకటేష్ , ఎం.ఎల్.సి సురభి వాణిదేవి , మేయర్ గద్వాల్ విజయలక్మి , వివిధ శాఖల ఉన్నతాధికారులు , భాగ్యనగర్ , ఖైరతాబాద్ , బాలాపూర్ గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్బంగా మాట్లాడిన డీజీపీ..హైదరాబాద్ లో ప్రతి ఏటా వినాయక పండుగ, నిమజ్జనం ఘనంగా జరుపుకుంటున్నాం..శాంతి భద్రతలు చాలా ముఖ్యం..అన్ని డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకుంటున్నాం అన్నారు.హైదరాబాద్ లోని పోలీసులతో పాటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు అన్నారు.

వినాయక ఫెస్టివల్ విషయంపై ఇప్పటికే పోలీసుల తో మీటింగ్ జరిగిందన్నారు సీపీ అంజనీకుమార్. బాలాపూర్ నుండి ట్యాంక్ బండ్ రూట్ లో కొన్ని కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరిగాయి..గణేశుడి హైట్స్ చూసుకోవాలి..ప్రతి మండపానికి క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగ్ పెడతాం అన్నారు.