రేవంత్ తీరుకు నిరసనగా మోత్కుపల్లి దీక్ష..

84

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఆదివారం బేగంపేటలోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేయనున్నారు మోత్కుపల్లి. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వ్యవహారం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు మోత్కుపల్లి.

గత 70 సంవత్సరాలుగా ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు నుండి చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ రెడ్డి చెప్పగలడా..? అని నిలదీసిన మోత్కుపల్లి… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఎంతో శోచనీయం అన్నారు.

రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో దళితుల మధ్య నిద్రలు చేసి భోజనం చేయగలడా..? అని ప్రశ్నించారు మోత్కుపల్లి. రేపు ఉదయం 9గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత.. ఇంటికి వెళ్లి దీక్ష చేస్తానని వెల్లడించారు.