- Advertisement -
రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల తర్వాత బయటికి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తుండగా లాక్ డౌన్ అమలుపై స్పందించారు డీజీపీ మహేందర్ రెడ్డి.
నిత్యావసర, ఫుడ్ డెలివరీ సేవలకు, మరియు ఈ-కామర్స్ ద్వారా జరిగే సేవలకు ఎటువంటి ఆటకం కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా, పోలీస్ ఉన్నతాధికారులు మరియు ఇతర భాగస్వామ్య ప్రతినిధులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్స్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో స్పందించిన డీజీపీ ఫుడ్ డెలివరీ సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు అని తెలిపారు.
- Advertisement -