కన్నతల్లిలాంటి పార్టీని వీడం:కమలాపూర్ జడ్పీటీసీ

127
trs
- Advertisement -

కన్నతల్లి లాంటి తెరాస పార్టీని వీడేదిలేదని కమలాపూర్ మండలం జెడ్పిటిసి లాండిగ కళ్యాణి లక్ష్మణ్ రావు,మాజీ జెడ్పిటిసి మారపెళ్లి నవీన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు మాట్ల రమేష్ తేల్చిచెప్పారు.

ఇవాళ ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని హన్మకొండలోని వారి నివాసంలో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో, పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని కమలాపూర్ మండలంలో తెరాసను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుధీర్ బాబు తదితరులు ఉన్నారు.

- Advertisement -