సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహామా?

6
- Advertisement -

రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలన కేంద్రం అయిన తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు దేవీ ప్రసాద్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దేవీ ప్రసాద్…సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసు గాయపరచడమే అన్నారు.తక్షణమే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందేనన్నారు.

సీఎం రేవంత్ పదేపదే వైఎస్, చంద్రబాబు పేర్లు ప్రస్తావిస్తున్నారు…తెలంగాణ అభివృద్ధిలో ప్రాంతేతరులు పాత్ర ఉన్నా, కేసీఆర్ పాత్ర లేదట ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు. కేసీఆర్ చేసిన మంచిని చెప్పడానికి రేవంత్‌కు నోరు రావడం లేదు..రేవంత్ తెలంగాణ వ్యతిరేక వైఖరి దీన్ని బట్టే తెలుస్తోందన్నారు. రేవంత్ చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కేసీఆర్ పేరు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకుల ప్రభుత్వంగా మారిపోయింది..15 కేబినెట్ సబ్ కమిటీలు కాలయాపన కోసమే వేశారు అన్నారు. తెలంగాణ తల్లిని తీసేస్తే, కేసీఆర్ పేరును తీసేసినట్టేనని రేవంత్ భావిస్తున్నట్టున్నారు..అన్ని అవమానాలకు లెక్క కడుతున్నాం అన్నారు. నిన్న కూడా మెదక్ జిల్లాలో స్వాతంత్ర్య వేడుకల ఆహ్వాన పత్రికలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అవమానపరిచారు…అన్ని వర్గాల నుంచి నిరసన వచ్చే సరికి మళ్ళీ ఆహ్వాన పత్రికను మార్చారు అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read:KTR:త్వరలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక

- Advertisement -