AAP: కేజ్రీవాల్‌కు నిరాశే..

9
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు. తాము విచారణ చేపట్టే వరకు బెయిల్ ఇవ్వొద్దని సూచించింది.

ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. దీంతో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..కేజ్రీవాల్‌ బెయిల్‌ పై స్టే విధించింది. దీంతో బెయిల్ పై కేజ్రీవాల్ వస్తారని ఆశీంచిన ఆప్ శ్రేణులతో పాటు కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది.

దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అవసరమైన సమయంలో కోర్టుకు హాజరుకావాలని, అదేవిధంగా దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. ఇక కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఇవాళ సాయంత్రం ఆయన బయటకు వస్తారని ఆశీంచిన హైకోర్టు స్టే విధించడంతో ఆప్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు.

Also Read:Modi:ప్రపంచ యోగా గురుగా భారత్

- Advertisement -