తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు..

43
kej

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఏ మార్గంలో వచ్చిన 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారన్ టైన్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారన్ టైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ నూతన వేరియంట్ ను గుర్తించిన నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.