కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ…

37
sonia

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తుండగా మరోవైపు ఆక్సిజన్ కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీలతో వర్చువల్ భేటీ కానున్నారు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.

బడ్జెట్ సమావేశాల తర్వాత కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరగడం ఇదే తొలిసారి కాగా కొవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహం, ప్రభుత్వానికి సూచనలు చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు.