ఢిల్లీలో లక్షా 60వేలు దాటిన కరోనా కేసులు..

143
coronavirus news

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతుండగా ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,60,016కి చేరాయి.

ఇవాళ కొత్త‌గా 1412 మందికి క‌రోనా పాజిటివ్ రాగా 14 మంది ప్రాణాలు కొల్పోయారు. కరోనాతో ఇప్పటివరకు 4,284 మంది మృతిచెందినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

1,44,138 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 11,594 యాక్టివ్ కేసులున్నాయి.