అన్నయ్యే నా స్పూర్తి ప్రధాత: పవన్

143
pawan

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ వదినపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో చిరంజీవిని అంతలా పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఒకవిధంగా చెప్పాలంటే అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారని పేర్కొన్నారు.

నాన్నలా మార్గదర్శిగా నిలిచారు.సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, నాలాంటివారెందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారని కొనియాడారు..అలాంటిఆయనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నారు పవన్.