- Advertisement -
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఢిల్లీ బస్సు, మెట్రో సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నిన్న ప్రారంభం అయింది. అయితే పథకం గురించి మహిళలు ఎమనుకుంటున్నారో తెలుసుకోవాడానికి ఆయన ఇవాళ బస్సులో ప్రయాణించారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న నేపధ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు కేజ్రీవాల్. ఈ పథకం పట్ల ఢిల్లీ మహిళలందరూ ఆనందం వ్యక్తం చేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు కేజ్రీవాల్. బుధవారం ఒక్క రోజే సుమారు 4.77 లక్షల మంది పింక్ టికెట్లను తీసుకొని, సిటీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు ఢిల్లీ ట్రాన్స్ పొర్టు కార్పొరేషన్ . బస్సులో ప్రయాణించే మహిళల కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.
- Advertisement -