టిబి పేషంట్ల కు అవగాహనను కల్పిస్తున్నాంఃమంత్రి ఈటెల

441
Etela
- Advertisement -

కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీబీ(క్షయ వ్యాధి)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. టిబి వ్యాధి వల్ల ప్రతి యేటా 12000 మంది పేషంట్లు చనిపోతున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామంలో 1000మందికి ఇద్దరు వాలంటరీలను నియమించటం జరిగిందని వారి ద్వారా టిబి పేషంట్ల కు అవగాహనను కల్పిస్తున్నాం అని అన్నారు. ఆరోగ్య వంతమైన తెలంగాణ కోసం రాష్ట్రం లో 4750 సబ్ సెంటర్లో anm లు పని చేస్తున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ లేని గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -