టాస్ గెలిచి ఫీల్డీంగ్ ఎంచుకున్న ఢిల్లీ..

190
Delhi Capitals
- Advertisement -

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే), యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) వాంఖడే వేదికగా శనివారం రాత్రి తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డీంగ్ ఎంచుకుంది. శ్రేయస్ నుంచి కెప్టెన్ బాధ్యతలను అందుకున్న రిషబ్ పంత్ ఎలా జట్టును ఎలా ముందుండి నడిపిస్తాడో చూడాలి.

ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ ‌కింగ్స్‌ 23 సార్లు తలపడ్డాయి. వీటిలో సీఎస్‌కే 15 సార్లు విజయం సాధించింది. ఢిల్లీ 8 సార్లు గెలిపోదింది. ఒక మ్యాచ్లో‌ మాత్రం ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2019లో చెన్నై ఢిల్లీపై పూర్తి అధిపత్యం కొనసాగించింది. రెండు లీగు మ్యాచుల్లో, రెండో క్వాలిఫయర్‌ల్లో ఢిల్లీని చిత్తుగా ఓడిచింది సీఎస్‌కే.ఇక ఐపీఎల్ 2020లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా వాటిలో ఢిల్లీయే విజయ దుందుభి మోగించింది.

తుది జట్లు:
చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్.

ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే, రిషబ్ పంత్‌, మార్కస్ స్టొయినిస్‌, శిమ్రాన్ హెట్‌మైయిర్‌, క్రిస్‌ వోక్స్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, టామ్‌ కరన్‌, అమిత్‌ మిశ్రా, అవేశ్ ఖాన్.

- Advertisement -