రాజస్ధాన్‌పై ఢిల్లీ గెలుపు

179
rr
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్‌ ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 148 పరుగులు చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆరో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలోకి చేరింది.

రాజస్ధాన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు ఓపెనర్లు స్టోక్స్, బట్లర్‌. ముఖ్యంగా బట్లర్ ఉంది కొద్దిసేపే అయినా ధాటిగా ఆడాడు. కేవలం 9 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటవ్వగా తర్వాత వచ్చిన స్మిత్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. అయితే మరో ఓపెనర్ స్టోక్స్‌ 41 పరుగులతో నిలకడగా రాణించాడు. శాంసన్‌ 25 ,ఉతప్ప 32 పరుగులు చేసి ఔటైనా క్రీజులో తెవాటియా ఉండటంతో ఆర్సీబీ శిబిరంలో గెలుపుపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ బౌలర్ల ముందు తెవాటియా గేమ్ పనిచేయలేదు. దీంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది.

అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది.ఆరంభంలో ఢిల్లీ వెంటవెంటనే రెండు వికెట్లు కొలోయిన మరో వికెట్ జాగ్రత్త పడకుండా ఆడారు ఢిల్లీ బ్యాట్స్‌మెన్. ముఖ్యంగా ధావన్‌ ‌ (57: 33 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(53: 43 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్ధాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(3/19), జయదేవ్‌ ఉనద్కత్‌ 2, కార్తీక్‌ త్యాగీ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి డెత్‌ ఓవర్లలోనూ ఢిల్లీ భారీగా పరుగులు రాబట్టలేక పోయింది.

- Advertisement -