తెలంగాణకు అండగా యావత్ దేశం: కోవింద్

110
cm kcr

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలపై ఆరా తీశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. యావత్ దేశం తెలంగాణకు అండగా ఉంటుందని తెలిపారు.

వ‌ర్ష ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్‌తో మాట్లాడానని… హైదరాబాద్, తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు.