- Advertisement -
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌ను చిత్తుచేసింది ఢిల్లీ. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ…కేవలం 10.3 ఓవర్లలో 119/1 స్కోరుతో ఛేదించింది. వార్నర్ (30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 60 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, పృథ్వీ షా (20 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 41) సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
అంతకముందు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రత్యర్థి స్పిన్ త్రయం ధాటికి 20 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. జితేశ్ శర్మ (32) టాప్‌స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ (24)ది తదుపరి అత్యధిక స్కోరు. అక్షర్, లలిత్, కుల్దీప్, ఖలీల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
- Advertisement -