ఆత్మనిర్భర్‌ భారత్..2,736 దేశీయ రక్షణ ఉత్పత్తులు

46
- Advertisement -

భారత ప్రధాని మోదీ కరోనా కష్టకాలంలో ఆత్మనిర్భర్‌ భారత్ స్కీంను ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు దేశీయ ఉత్పత్తులను పెంచాలని దానికి తగిన ప్రోత్సహాం కల్పిస్తామని మోదీ చెప్పుకొచ్చారు. అయితే దానికి తోడు 2021ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు అనేక రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ అమలు అవుతుంది. తాజాగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

Also Read: కాంగ్రెస్ కు దెబ్బ తీస్తోంది అదే !

ఇప్పటివరకు భారత సైన్యంలో 4,666 వస్తువులను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. 2022 డిసెంబర్ నాటికి దేశీయ వస్తువుల సంఖ్య 2,736 చేరుకుందని వాటి విలువ రూ.2,570కోట్లని తెలిపింది. వీటిని 2024-25 నాటికి రూ 35వేల కోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు జరిపి మొత్తంగా రూ.1,75,000 రక్షణ పరికరాల తయారీని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పెద్ద మొత్తంలో రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

Also Read: హస్తినకు కర్ణాటక పాలిటిక్స్

- Advertisement -