76వ పదాతిదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుద్గామ్‌లో భారత సైన్యం నిర్వహించిన శౌర్యదివస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈకార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ… 76వ పదాతిదళ దినోత్సవం సందర్భంగా ధైర్యవంతులైన పదాతి దళ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
అక్టోబరు27, 1947న కాశ్మీర్ లోయలో భారతగడ్డపై జరిగిన మొదటి దాడిని భారతసైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. సిక్కు రెజిమెంట్ యొక్క 1వ బెటాలియన్ పాకిస్థాన్ సైన్యం యొక్క దుష్ట ఆకృత్యాలను తిప్పికొట్టింది. దీనిని స్వతంత్ర భారతదేశపు మొదటి సైనిక సంఘటనగా పేర్కొంటారు. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబరు 27న భారత సైన్యం పదాతిదళ దినోత్సవంగా జరుపుకుంటుంది.
అయితే ఇదే నెలల్లో కేంద్రమంత్రి జమ్ముకాశ్మీర్‌ను సందర్శించిన రెండో వ్యక్తి. కేంద్రహోం మంత్రి అమిత్‌షా అక్టోబరు4న కేంద్రపాలిత ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ప్రస్తుతం రక్షణమంత్రి రెండు రోజుల పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌కు చేరుకుంటారు. అయితే భారత ప్రధాని దీపావళీ పండుగను కాశ్మీర్‌లో జరుపుకొవడం విశేషం.
2022వ సంవత్సరం భారత వైమానిక దళం యొక్క కాశ్మీర్ ఎయిర్ బేస్ స్వర్ణోత్సవ వేడుకు కూడా ఇదే రోజు కావున భారతసైన్యం మరియు వైమానిక దళం రెండింటికి ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి..