చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో విరాట్‌

290
- Advertisement -

ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌కోహ్లీ ఆఖరి బంతి వరకు ఉండి జట్టును విజయాతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 82పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఇంటర్‌నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ టీ20ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ప్రస్తుతం కోహ్లీ టాప్‌టెన్‌లోకొ చేరిపోయాడు. టాప్‌టెన్‌లో మొదటి స్థానాన్ని పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్‌ రిజ్వాన్‌(849)పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. రెండవ స్థానంలో కాన్వే(న్యూజిలాండ్‌ 831), మూడవ స్థానంలో భారత అటగాడు సూర్యకూమార్‌ యాదవ్‌(828) ఉన్నారు. 2022ఆగస్ట్‌ నాటికి విరాట్‌ టీ20లో 15వ స్థానంలో ఉన్నాడు. తాజాగా కోహ్లీ(635) జరిగిన పాకిస్థాన్‌ మ్యాచ్‌ ద్వారా 6స్థానాలను మెరుగుపరుచుకోని 9వ స్థానానికి చేరుకున్నాడు.

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్

  1.  మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) 849 పాయింట్లు
  2. డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)831 పాయింట్లు
  3.  సూర్యకుమార్ యాదవ్ (భారత్)828 పాయింట్లు
  4.  బాబర్ ఆజం (పాకిస్థాన్)799 పాయింట్లు
  5.  ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా)762 పాయింట్లు
  6.  డేవిడ్ మలన్ (ఇంగ్లండ్)754 పాయింట్లు
  7.  ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)681 పాయింట్లు
  8.  పాతుమ్ నిస్సాంక (శ్రీలంక)658 పాయింట్లు
  9.  విరాట్ కోహ్లీ (భారత్)635 పాయింట్లు
  10.  ముహమ్మద్ వసీమ్ (యూఏఈ)626 పాయింట్లు

ఇవి కూడా చదవండి..

మరోసారి తలపడనున్న దాయాదులు!

భారత్‌ చేతిలో పాక్‌ ఘోరపరాజయం

ఆకాశమే నీకు హద్దుగా సాగిపో

- Advertisement -