అతనితో పిల్లలు కూడా కనేశా..

134
Deepika

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హాలీవుడ్ లో నటించిన సినిమా ‘ట్రిపుల్ ఎక్స్’రిటర్న్ ఆఫ్ జాండర కేజ్. హాలీవుడ్ హాలీవుడ్ సూపర్ స్టార్ విన్ డీజిల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించగా..దీపిక కీలక పాత్రలో నటించింది. అయితే ఇటీవలె ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విన్ డీజిల్ ను దీపికా ఇండియాకు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా అమ్మడు మాట్లాడుతూ..స్టార్ విన్ డీజిల్ పై తన ప్రేమను ఒలకబోసింది. అతనిపై తనకు ఎంతో ప్రేమ ఉందని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే వెల్లడించింది. అంతేకాదు, అతనితో పిల్లలను కూడా కన్నానని చెప్పిన దీపికా, ఇదంతా నిజం కాదని, తన ఊహ అని ఒక మెలిక పెట్టింది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర కేజ్’ సినిమాతో విన్ డీజిల్ సరసన నటించిన దీపిక, ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఇప్పటికే మన దేశంలో విడుదలైన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే విడుదల కానుంది.

Deepika

ఎంతో బిజీగా ఉన్న దీపిక ప్రఖ్యాత టీవీ షో ‘ఎలెన్ డిజెనరస్’లో పాల్గొంది. ‘ట్రిపుల్ ఎక్స్’ మూవీలో విన్ డీజిల్ తో కెమిస్ట్రీ బాగా పండటానికి కారణం మీ మధ్య ఏమైనా రొమాన్స్ ఉందా? అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘మేం కలిసి ఉన్నట్టు, కలిసి జీవించినట్టు, మాకు అద్భుతమైన పిల్లలు కూడా పుట్టినట్టు నా ఊహల్లో అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో దీపిక ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీపిక ప్రియుడు రణ్ వీర్ సింగేనని ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రం ప్రమోషన్ నిమిత్తం భారత పర్యటనకు వచ్చిన డీజిల్ కూడా స్పష్టం చేయడం తెలిసిందే.

Deepika