ఇండస్ట్రీలో అతనే నాకు బెస్ట్ ఫ్రెండ్..

262
Balakrishna
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం బాలక్రిష్ణ ఇద్దరు టాలీవుడ్ సినీయర్ హీరోలు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు బరిలో దిగుతున్నారంటే…ఇక బాక్సాఫీస్ వద్ద రసవత్తర పోరే. ఈ హీరోల మధ్యే కాదు..వారి ఫ్యాన్స్ లో కూడా ఇలాంటి పోటీ వాతావరణమే నెలకొటుంది. మెగా అభిమానులు..నందమూరి అభిమానులు తమహీరో పై చేయి అంటే తమహీరోనే పై చేయి సాధించాడంటూ పోటీ పడుతుంటారు. తాజాగా రిలీజైన ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి రెండు సినిమాల మధ్య ఇలాంటి పోటీ వాతావరణమే నెలకొంది. ఎవరికి ఎవరు ఏ మాత్రం తక్కువ కాకుండా కలెక్షన్స్ సాధిస్తున్నారు. సినిమా పరంగా ఇద్దరి మధ్య ఎంత సమరం నడిచినా…వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. తాజాగా చిరంజీవి గురించి బాలయ్య ఆసక్తిమైన విషయాన్ని తెలియజేశాడు.

 Balakrishna,

శాతకర్ణి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలయ్య..చిరు గురించి ప్రస్తావించారు. ఇండస్ట్రీలో చిరంజీవినే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపాడు. ఖైదీ సినిమాను మీకు పోటీగా భావిస్తారా అంటే..శాతకర్ణి, ఖైదీ రెండు సినిమాలో పోటీపడి మరీ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. రెండు సినిమాలు కన్ఫామ్ అయ్యాయని అందులో ఒకటి కృష్ణ వంశీతో రైతు సినిమా చేయబోతున్నానని..అందులో అమితాబ్ బచ్చన్ కూడా గెస్ట్ రోల్ చేయనున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఆదిత్య 999 అనే మరో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు.

 Balakrishna,

- Advertisement -