బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సినియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాలు థాయ్ ల్యాండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు.
బయోటెక్నాలజీ దిగ్గజం బయోటెక్ నగరంలో నూతన యూనిట్ ప్రారంభించనున్నది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న యూనిట్ ను మరింత విస్తరించనున్నది. ఈరోజు హెచ్ ఐఐసిలో మంత్రి కెటి రామారావు ఈరోజు బయోకాన్ యండి కిరణ్ మజుందార్ షాతో సమావేశం అయ్యారు. జినోమ్ వ్యాలీలో బయోకాన్ నూతన అర్ అండ్ డి సెంటర్ ను ఎర్పాటు చేస్తున్నట్లు అమె మంత్రికి తెలిపారు. తమ అనుబంద కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1000 హైస్కిల్స్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్‌లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని అమె మంత్రికి తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి, కిరన్ మజుందార్ కు దన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరపున టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మంత్రి చేస్తున్న కార్యక్రమాలకు అమె అభినందనలు తెలిపారు. ఫార్మసిటీ ఏర్పాటు గురించి మంత్రి వివరించారు. భవిష్యత్తు విస్తరణకు ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి, రానున్న కిరణ్ మజుందార్షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని 20 టాప్ స్టార్ట్ అప్స్ తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాయకత్వాన్ని కిరణ్ మజుందార్ షా అభినందించారు.
మంత్రి నాయకత్వంలో దేశంలో ఏట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్ మరియు ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందన్నారు. పారిశ్రామికవేత్తలకు మంత్రి లాంటి నాయకులను చూసినప్పుడు స్పూర్తి కలుగుతున్నదని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగరంపైన సైతం కిరణ్ మజుందార్ షా ప్రసంశలు కురిపించారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు అయారంగాల్లోని నిపుణులు, పరిశ్రామిక వేత్తులు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమీటీని ఎర్పాటు చేయాలన్నారు.
జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెండ్, సియివో టెర్రీ బ్రెసెన్హమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డైవైసెస్ పార్కు గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టివర్క్స్ లో జీఈ భాగస్వాములవుతున్నదని ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు. బయోటెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్జానాన్ని హైదరాబాద్ నగరంలోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలపైన అమె మంత్రితో చర్చించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు ముప్పై లక్షల ల్యాబరేటరీ స్పేస్ ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి టెరీకి తెలిపారు. త్వరలోనే జినోమ్ వ్యాలీ పర్యటనకు వస్తానని టెరీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యూబేటర్ లో జీఈ భాగస్వాములవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను మంత్రి టెరీ కి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్(TASK) తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉన్నదని టేరీ మంత్రి కెటి రామారావుకు తెలిపారు.
థాయ్ లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యాప్రఫసారాతో మంత్రి సమావేశం అయ్యారు. థాయ్ లాండ్ నుంచి వచ్చిన సూమారు 20 కంపెనీలతో కూడిన మంత్రి బృందం తెలంగాణలోని వ్యాపారావకాశాలపైన మంత్రి కెటి రామరావుతో చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ, హైదరాబాద్ నగరంలో ఫార్మ, లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలపైన థాయ్ లాండ్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. థాయ్ లాండ్ దేశానికి భారతదేశం కీలకమైన వాణ్యిజ్య సంబంధాలున్న దేశమని తొలిసారి హైదరాబాద్ పర్యటనలోనే ఇక్కడి పాలసీలు, పెట్టుబడి అవకాశాలు తమను అకట్టుకున్నాయని చుటిమా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ టియస్ ఐపాస్ విధానాన్ని ప్రసంశించారు.
భారతదేశంలో ఇటాలియన్ కాన్సుల్ జెనరల్ ఇన్ ముంబాయి స్టేఫానియా కస్టాన్జా తో మంత్రి సమావేశం అయ్యారు. భాద్యతలు చేపట్టిన తర్వతా హైదరాబాద్ నగరంలో తొలిసారి పర్యటిస్తున్న తనకు ఇక్కడి టెక్స్ టైల్ రంగం, ఫార్మా, సినిమా పరిశ్రమ అనుబంద రంగాలలో పెట్టుబడులు అవకాశాలపైన అలోచిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బయోటెక్ రంగంలో ఇటలీ దేశ ఇకో సిస్టమ్ తో ఇక్కడ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలపైన అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగాన్ని ఇటలీలోని అనేక ఫ్యాషన్ రంగాన్ని కలిపేందుకు ఉన్న అవకాశాలపైన ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావును అడిగి తెలుసుకున్నారు.
అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిరోస్సేస్, టెక్స్ టైల్ రంగాల్లో అనేక పెట్టబడి అవకాశాలున్నాయని, తెలంగాణలో పెట్టుబడులు కోసం ముందుకు వచ్చే ఇటాలియన్ కంపెనీలకు అన్ని విధాలుగా సహాకరిస్తామని, ఈ దిశగా అయా కంపెనీలకు తెలంగాణను పరిచయం చేయాలన్నారు. మంత్రి విజ్జప్తి మేరకు త్వరలోనే ఇటాలియన్ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఎర్పాటు చేస్తామని, తెలంగాణలోని వ్యాపారావకాశాలు, పారిశ్రామిక విధానాలను తెలియజేస్తామని అమె మంత్రికి హమీ ఇచ్చారు. భారతదేశంలో ఫార్మ పరిశ్రమ అభివృద్దికి ఉన్న సవాళ్లు అనే అంశంపైన ఫార్మ కంపెనీల సియివోలతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సియివో ఉదిత్ భాత్రా, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు.