చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు ఈ వైరస్ వల్ల 490మంది మృతి చెందారు. కేవలం హుబేయ్ ప్రావిన్సులోనే మంగళవారం మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20కి పైగా దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. చైనాలో వైరస్ సోకిన కేసులు సుమారు 24వేలకు చేరుకున్నది. చైనా చేస్తున్న నియంత్రణ ఏర్పాట్లు వల్ల కరోనా వ్యాప్తి అదుపులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొన్నది.
కర్ణాటక రాష్ట్రంలో 51 మంది చైనా నుంచి రాగా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స చేస్తున్నారు. పూణే నగరంలోని జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్‌కు 44 శాంపిల్స్ రాగా దీనిలో 29శాంపిల్స్ నెగిటివ్ అని తేలింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో అన్ని ఎయిర్ పోర్టుల వద్ద ప్రత్యేక వైద్యులతో చెకింగ్ చేయిస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా వున్న హుబేయ్ రాజధాని వుహాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. అసలు ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావడం లేదు. చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ వైరస్ మాత్రం ఆగడం లేదు.