‘రొమాంటిక్’ మూవీలో ఇస్మార్ట్ శంకర్

491
Romantic RAm
- Advertisement -

దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరీ జగన్నాథ్ ఈసినిమాకు స్టోరీ అందించగా నూతన దర్శకుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై చార్మీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇటివలే విడుదలైన ఈమూవీ టీజర్ కు అద్భతమైన స్పందన వచ్చింది. తాజాగా ఉన్న సమాచారం మేరకు హీరో రామ్ ఈసినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మార్చి మొదటి వారంలో ఈమూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రయూనిట్. కాగా పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -