దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని (మే 4) స్మరించుకుంటూ ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మాజీ గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా దాసరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దర్శకుడు డా.రంజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు చేయించారు. ఇందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి కళాతరంగిణి, నాట్య తరంగిణి అవార్డులు రోశయ్య చేతుల మీదుగా ఇప్పించారు.
ఈ కార్యక్రమంలో రోశయ్య మాట్లాడుతూ…“ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత రంజిత్ కుమార్‌ని అభినందిస్తూ.. సినిమా రంగంలో ఉన్న రంజిత్ కుమార్ ఇలా ప్రముఖ దర్శకుడు దాసరి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం, ఇందులో ఉత్తమ న్యత్య ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు అవార్డులు ప్రదానం చేయడం అభినందించదగ్గ విషయం. ఇలాగే ఆర్.కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఇంకా అభివృద్ది చెందాలని మనస్పూర్తిగా కోరుకంటున్నా“ అన్నారు.
ఆర్.కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంజిత్ కుమార్ (నాగేశ్వరరావు) మాట్లాడుతూ..“దర్శకరత్న దాసరి జన్మదినాన్ని కొత్తగా చేయాలని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గురువు గారి జన్మదిన వేడుకలు గ్రాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పిలల్లు, 200 మంది పెద్దలు పాల్గొన్నారు. డైరక్టర్స్ డే తో పాటు గురువుగారి జన్మదిన వేడుకలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా“ అన్నారు.