Dasara:దసరాపై సూపర్‌స్టార్ కామెంట్ ఎంటంటే..!

91
- Advertisement -

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా దసరా. ఊరమాస్‌ లుక్‌లో కనిపించే నాని శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

దీన్నిపై మహేశ్‌బాబు ట్వీటర్ వేదికగా స్పందిస్తూ..సినిమా అద్భుతంగా ఉందని, ఈసినిమా విషయంలో తాను ఎంతగానో గర్విస్తున్నానని అన్నారు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్నిపై నాని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నాని స్పందిస్తూ మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో కీర్తిసురేష్, దీక్షిత్‌శెట్టి, సాయికుమార్, సముద్రఖని కీలకపాత్రలో నటించారు. శ్రీరామనవమి సందర్భంగా తెలుగుతోపాటుగా హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి…

NBK108:ఈసారి దసరాకి బాలయ్య

SalmanKhan:పూజా హెగ్డే ‘బతుకమ్మ సాంగ్’

దాస్ కు ధమ్కీ ఇచ్చిన నాని

- Advertisement -