SalmanKhan:పూజా హెగ్డే ‘బతుకమ్మ సాంగ్’

51
- Advertisement -

సల్మాన్ ఖాన్ ,పూజా హెగ్డే నటించిన రాబోయే చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ నుండి తాజాగా “బతుకుమ్మ” అనే కొత్త పాటను రిలీజ్ చేశారు. ఏటా తొమ్మిది రోజుల పాటు మహిళలు జరుపుకునే తెలంగాణ పండుగను ప్రతిబింబించేలా ఈ సాంగ్ ను డిజైన్ చేశారు. తెలంగాణ సంప్రదాయాన్ని హిందీలో సినిమాలో చూపిస్తూ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అందరినీ సర్ ప్రయిజ్ చేస్తుంది. సాంగ్ లో పూజా హెగ్డే తో వెంకీ పంచే కట్టులో కనిపించి ఆకట్టుకున్నారు.

బతుకుమ్మ వీడియో చివరలో, సల్మాన్ ఖాన్ సంప్రదాయ దుస్తులలో ఆశ్చర్యంగా కనిపించాడు. బతుకమ్మకు రవి బస్రూర్ సంగీతం అందించారు, సంతోష్ వెంకీ, ఐరా ఉడిపి, హరిణి ఇవటూరి, సుచేత బస్రూర్, మరియు విజయలక్ష్మి మెట్టినహోళీ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకి షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్, కిన్నాల్ రాజ్ మరియు హరిణి ఇవటూరి సాహిత్యం అందించారు.

ఫర్హాద్ దర్శకత్వం వహించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ద్వారా భారీ అంచనాలతో రూపొందించబడింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే, జగపతి బాబు, భూమిక చావ్లా, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ మరియు వినాలి భట్నాగర్ వంటి తారాగణం ఉంది. 21 ఏప్రిల్ 2023న రంజాన్ స్పెషల్ గా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…

Balagam:అంతర్జాతీయ వేదికపై మన బలగం సినిమా..!

Dasara:బాంచత్..బాక్సాఫీస్ షేక్

Kajal:బాలీవుడ్ కన్నా సౌత్‌ ఇండస్ట్రీస్‌ బెటర్‌..!

- Advertisement -