దాస్ కు ధమ్కీ ఇచ్చిన నాని

56
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఉగాది సందర్భంగా మార్చ్ 22 న విదుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే మంచి వసూళ్లు అందుకుంది. తొలి రోజే ఈ సినిమాకు 8 కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగు రోజుల్లోనే 18 కోట్లు దాటేసింది. తొమ్మిది రోజులకు గానూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21 . 51 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 15 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 11 కోట్ల షేర్ రాబట్టింది.

ఫైనల్ గా దాస్ కా ధమ్కీ తో తొలి వారం మంచి కలెక్షన్స్ అందుకున్న విశ్వక్ కి దసరాతో ధమ్కీ ఇచ్చాడు నాని. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దసరా థియేటర్స్ లో భారీ లెవెల్ లో సందడి చేస్తుంది. తొలి రోజు ఈ పాన్ ఇండియా మూవీకి వరల్డ్ వైడ్ గా 38 కోట్ల గ్రాస్ వచ్చిందని తెలుస్తుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో 24 :85 కోట్లు (గ్రాస్) అందుకుంది.

ఈ లెక్కన చూస్తే ‘ధమ్కీ’ పై ‘దసరా’ ఎఫెక్ట్ గట్టిగా ఉంది. రెండో వారం కూడా ఈ సినిమా ఇంకొన్ని కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని భావించిన విశ్వక్ కి దసరా అల్మోస్ట్ కలెక్షన్స్ బ్రేక్ వేసేశాయి. ఇక ఆడియన్స్ ఈ వీకెండ్ దసరా కాకుండా మరో సినిమా ఆప్షన్ చూస్తే మాత్రం ధమ్కీ కి ఇంకొంత వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఫైనల్ రన్ లో ధమ్కీ ఎంత కలెక్ట్ చేస్తుందో ?

ఇవి కూడా చదవండి…

#NBK108…దసరాకి రెడీ..!

రావణాసుర నెక్ట్స్‌ లెవల్‌..హర్షవర్థన్‌

ప్రేమలో త్రిష.. పెళ్లికి రెడీ

- Advertisement -