కేటీఆర్‌ పిలుపు…ఫ్లాస్మా దానంచేసిన దండె విఠల్

366
dande vital
- Advertisement -

ప్లాస్మా దానం చేయాలని టీఆర్ఏస్ కేడర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టి .రామారావు ఇచ్చిన పిలుపు నేపథ్యం లో సీనియర్ నేత దండె విఠల్ స్పందించారు. కరోనా బారిన పడి విషమ స్థితిలో ఉన్న రోగి కి కాచిగూడ ప్రతిమ హాస్పిటల్ లో మంగళ వారం నాడు తన ప్లాస్మాను దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు .ఇటీవలనే దండె విఠల్ కరోనా వ్యాధి తో పోరాడి గెలిచారు .ఓ విలువైన ప్రాణాన్ని కాపాడేందుకు తన ప్లాస్మా (ఓ ,పాజిటివ్ )ను దానం చేయడం సంతోషంగా ఉందని దండె ఓ ప్రకటన లో తెలిపారు.

- Advertisement -