గ్రామాల్లో వైద్యసేవలు అందించాలి:కోవింద్

247
ramnath kovind
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి రావాలని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కరీంనగర్ లో ప్రతిమ వైద్యకళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కోవింద్ పట్టణాల్లోని వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

వైద్యరంగంలో మనదేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందని … మెడికల్ టూరిజానికి భారత్ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తోందని చెప్పారు. చారిత్రక నేపథ్యం గల కరీంనగర్ కు రావడం ఇదే ప్రథమమన్నారు. తలసేమియా బాధితుల విషయంలో ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉన్నామన్నారు.

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్ని అరికట్టాలని .. తలసేమియా దేశాన్ని కృంగదీసే వ్యాదన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందని చెప్పారు.

- Advertisement -