నల్గొండ జిల్లాలో పరువు హత్య…

606
Dalit man hacked to death
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ప్రణయ్ అనే యువకుడిని కిరాతకంగా అంతమొందించారు. ఈ హత్య కేసులో నిందితులైన అమృత తండ్రి మారుతిరావు,బాబాయ్ శ్రవణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే మిర్యాలగూడకు చెందిన అమృత,ప్రణయ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయమై అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. ప్రణయ్‌ నుంచి అమృతను విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు ఆమె తండ్రి మారుతిరావు. కానీ అమృత ససేమిరా అనడంతో కోపం పెంచుకున్న మారుతిరావు..ప్రణయ్ చంపేస్తానని అందరిముందే హెచ్చరించాడు.

Dalit man hacked to death in Nalgonda

ఈ నేపథ్యంలో కొంతకాలంగా ప్రణయ్ కదలికలపై నిఘా ఉంచిన మారుతిరావు ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ప్రణయ్‌పై కిరాయి హంతకుడితో దారుణంగా చంపించాడు. కత్తివేటుకు ఆస్పత్రి సమీపంలోనే కుప్పకూలాడు ప్రణయ్‌. కళ్ల ముందే భర్త చనిపోవడాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది అమృత.

తన భర్త చావుకు తండ్రి అమృతరావే కారణం అని తెలిపింది అమృత. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తన కళ్ల ముందే ప్రణయ్‌ని కొట్టి చంపేశారని…ప్రణయ్‌ని ఆ పరిస్థితుల్లో చూస్తానిన ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. జీవితాంతం హ్యాపీగా ఉందామనుకున్నామని..ప్రణయ్‌ని నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంటూ విలపించింది.

- Advertisement -