చివరి సారిగా మా నాన్నను చూస్తానుః అమృత

196
Pranay_Amrutha-father_collage

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మారుతీరావు. ఇక మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించిన పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా ఆసుపత్రితో పోస్టుమార్టం అనంతరం మారుతిరావు మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించారు. మారుతీరావు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం జరుగనున్నాయి.

తన తండ్రిని చివరిసారిగా ఒక్క సారి చూస్తానని పోలీసులను కోరింది అమృత. అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ విషయాన్ని అమృత తల్లికి చెప్పగా ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. అమృత ఇక్కడికి వస్తే మా అన్న ఆత్మ శాంతించబోదన్నారు అమృత బాబాయ్ శ్రవణ్. మరి తన తండ్రిని చివరి సారిగా చూసేందుకు అమృత వస్తుందా రాదో చూడాలి.