టీవీ9మాజీ సీఈవో రవిప్రకాశ గత నాలుగు రోజుల నుంచి విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. రవిప్రకాశ్ కేసు విచారణ జరుపుతున్న సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రవి ప్రకాశ్ ను గత నాలుగు రోజులుగా విచారిస్తున్నాం..కానీ ఆయన ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. రవిప్రకాశ్ బయట ఒకలా, విచారణలో మరోలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే, రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని వెల్లడించారు. రవిప్రకాశ్ సాక్ష్యులను బెదిరించినట్టుగా కూడా తమ విచారణలో గుర్తించామని చెప్పారు.
ఫోర్జరీ కేసుకు సంబంధించి కొందరు వ్యక్తుల నుంచి కీలక సమాచారం, ఆధారాలు సేకరించామని ఏసీపీ శ్రీనివాస్ వివరించారు. అలాగే నటుడు శివాజికి కూడా నోటిసులు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే అతన్ని కూడా విచారిస్తామన్నారు. రవి ప్రకాశ్ చెప్పిన సమాధాలను బద్రపరిచాము..వాటిని రేపు కోర్టు ముందు సమర్పిస్తామని చెప్పారు. కోర్ట్ ఇచ్చే ఉత్తర్వులను బట్టి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాల వద్ద అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు