దిశ ఎన్ కౌంటర్..సుప్రీం ముందుకు సీపీ సజ్జనార్

410
sajjanar
- Advertisement -

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఎన్ కౌంటర్ పై పలువురిని విచారిచింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. కేసు వివరాలను అందించడానికి సజ్జనార్ ఢిల్లీకి పయనమయ్యారు. దిశ కేసు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చిచంపారని దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరుగనుంది. హైదరాబాద్‌లో విచారణ ముగించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు బుధవారం తమ సంఘానికి నిజనిర్ధారణ నివేదికను అందజేయనున్నారు.

- Advertisement -