టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..

40

ఐపీఎల్‌-13లో నేడు మరో కీలకమైన మ్యాచ్‌ జరగనుంది. వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్న కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని చెన్నై ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తికరంగా మారింది. చెన్నైపై భారీ తేడాతో గెలుపొందాలని కోల్‌కతా భావిస్తోంది. ప్లేఆఫ్‌ రేసులో ఉన్న కోల్‌కతాకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. కోల్‌కతా ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w / c), ఎన్ జగదీషన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కరుణ్ శర్మ, దీపక్ చాహర్, లుంగి ఎన్గిడి

కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (wc), ఎయోన్ మోర్గాన్ (c), సునీల్ నరైన్, రింకు సింగ్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి