చేనేత హస్త కళాకారులకు చేయూత:సీఎస్ సోమేశ్‌

72
cs somesh
- Advertisement -

చేనేత హస్త కళాకారులకి చేయూతను అందిస్తామని తెలిపారు సీఎస్ సోమేశ్‌ కుమార్. హైదరాబాద్ శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ ముగింపు సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన చేనేత హస్త కళాకారులను ఆయన కలిసి కళా ఉత్పత్తులను   అడిగి తెలుసుకున్నారు.

నేషనల్ అవార్డ్ వచ్చిన చేనేత హస్త కళాకారులను ఆయన సన్మానించారు. శిల్పారామం  పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రతకు , రంగు రంగు పూలని అలంకరించడం, టెర్రకోట ఆర్చ్లు, అందాలు తనను మంత్రముగ్దులను చేస్తాయన్నారు. చేనేత హస్త కళాకారులకి చేయూతను  ప్రభుత్వమూ అందిస్తుంది అని చెప్పారు. శ్రీమతి వైదేహి సుభాష్ గారి శిష్య బృందం ప్రదర్శించిన  భరతనాట్య ప్రదర్శన  ఆధ్యంతం తిలకించారు.

- Advertisement -