రాష్ట్రంలోగల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్ , డిస్కం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెల తప్పనిసరిగా విద్యుత్ బిల్లులను చెల్లించాలని…చెల్లించని పక్షంలో తగు చర్యలు తీసుకోబడుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టంచేశారు.
పెండింగ్ విద్యుత్ బకాయిలు అంశంపై నిర్ణయాన్ని త్వరలో తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నుండి డిస్కం లకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చేర్చించి ఒక వారంలోపులో సమగ్ర నివేదిక రూపోందించాలని ఆయన ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థలలో పేరుకపోయిన పెండింగ్ విద్యుత్ బకాయిలపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు త్వరలో విధానపరమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటారని… కావున సంబంధిత శాఖ అధికారులు పూర్తి వివరాలతో నివేధికను రూపొందించాలని సూచించారు.
పనిచేయని బోరుబావులకు సంబంధించిన విద్యుత్ బిల్లులు తదితర అంశాల పై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటిలు, డిస్కం అధికారులు సంయిక్త బృందాలను తక్షణమే ఏర్పాటు చేసి పెండింగ్ అంశాలపై పరిష్కరించాలని అన్నారు. కరెంట్ మీటర్ రీడింగ్ ప్రాతిపదికనే చార్జిలను వసూలు చేయాలని, నూటికి నూరు శాతం సమగ్ర వివరాలు ఉండాలని ఆదేశించారు. ఒక నెల లోపలో అవసరమైన చోట విద్యుత్ మీటర్లను బిగించాలని సూచించారు.
ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, కమీషనర్ శ్రీ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, డిస్కం సి.యం.డి లు రఘుమా రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.